మహిళలకు షీ ఆటోలు | she autos distribution on womens day | Sakshi
Sakshi News home page

మహిళలకు షీ ఆటోలు

Feb 24 2018 9:40 AM | Updated on Feb 24 2018 9:40 AM

she autos distribution on womens day - Sakshi

మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సత్యనారాయణ, చిత్రంలో ఈశ్వరరావు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ పెంటోజీరావు

చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన మహిళలకు ఆటోలు అందజేయనున్నట్లు సంక్షేమ రుణాల కన్వీనరు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆటోలు అందజేస్తామన్నారు. మహిళలకు సాధికారత కోసం స్వయంశక్తితో ఎదిగేందుకు ఆటోలను పంపిణీ చేసే ఆలోచన చేశామన్నారు.

కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మహిళలకు సబ్సిడీపై అందజేయనున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న మహిళలను మెప్మా పీడీ, అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్, మహిళా కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. లక్ష రూపాయల సబ్సిడీతో ఈ ఆటోలను అందజేస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 50 మందికి, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 25 మందికి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 50 మందికి, కాపు కార్పొరేషన్‌ ద్వారా 50 మందికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలకు ఆటోలు అందజేసే ముందుగా శిక్షణా కార్యక్రమంతో పాటుగా లైసెన్సులను తామే అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఈడీ జి పెంటోజీరావు, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement