సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష! | Seemandhra congress leaders to go on satyagraha | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష!

Aug 27 2013 7:45 AM | Updated on Sep 1 2017 10:10 PM

రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని చేస్తున్న విజ్ఞప్తులను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు.

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని చేస్తున్న విజ్ఞప్తులను అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. అందులో భాగంగా సత్యాగ్రహ దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరడంతోపాటు ఇందుకోసం సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్  శైలజానాథ్ గత రెండ్రోజులుగా ఈ విషయంపై ఆ ప్రాంత నాయకులతో చర్చిస్తున్నారు. సీమాంధ్ర ప్రజలు 25 రోజులుగా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కార్యక్రమాలు రూపొందించుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయని సత్యాగ్రహ దీక్ష చేయాలని యోచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement