బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు | security change in ap cm chandrababu naidu house | Sakshi
Sakshi News home page

బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు

Jun 11 2015 1:26 PM | Updated on Sep 3 2017 3:35 AM

బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు

బాబు మదిలో చెలరేగుతున్న అనుమానాలు

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి తన నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి తన నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఎవరిని చూసినా.. చంద్రబాబుకు అనుమానం కలుగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ నాయకులందరిని అనుమానంతో చూస్తున్న బాబు ఇప్పుడు  తన ఇంట్లో పనిచేస్తున్న వారని కూడా వదలడం లేదు.  తన ఇంట్లో పని చేస్తున్న అందర్ని ఆయన తొలగించినట్టు తెలుస్తోంది.  

సెక్యూరిటీ  సిబ్బందిని తొలగించిన వారి స్థానంలో  కొత్తవారిని, అందునా నమ్మకస్థులని భావించే వారిని మాత్రమే నియమించుకున్నట్లు సమాచారం.  తొలగించిన వారి  జాబితాలో పని మనుషులు నుంచి కారు డ్రైవర్లు వరకూ ఉన్నారు.   కొందరైతే 20 ఏళ్లుగా చంద్రబాబు ఇంట్లో పని చేస్తున్నారు. సమాచారం లీకవుతుందనే అనుమానంతో కింది స్థాయి  సిబ్బంది అందర్ని ఆయన మార్చినట్టు తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు అనుమానంపై సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎవరో చేసిన తప్పులకు తమను బాధ్యులు చేయడమేంటనే భావన సిబ్బందిలో వ్యక్తమవుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement