చిట్టీల పేరుతో రూ. 5కోట్లకు టోకరా | RS 5crore cheating by name of Chitties | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ. 5కోట్లకు టోకరా

Mar 1 2015 9:44 PM | Updated on Sep 2 2017 10:08 PM

చిట్టీల పేరుతో దంపతులిద్దరూ ఘరానా మోసానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లాలోని నర్సింహనగర్లో ఆదివారం చోటుచేసుకుంది.

విశాఖ: చిట్టీల పేరుతో ఓ దంపతులిద్దరూ ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని నర్సింహనగర్లో ఆదివారం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఈ దంపతులిద్దరూ చిట్టీలు నడుపుతున్నారు. అదినమ్మిన బాధితులు వారివద్ద చిట్టీలు వేశారు. బాధితుల నుంచి వసూలు చేసిన రూ. 5కోట్లకు టోకరా వేసి నిర్మల, నాయుడు అనే దంపతులు పరారైయ్యారు. 

మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  కాగా, ఏవీఎన్ కాలేజీలో లెక్చరర్గా నిందితుడు నాయుడు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement