రూ.1.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | rs. 1.40 lakd worth gutka caught in ananthpur district | Sakshi
Sakshi News home page

రూ.1.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Jan 9 2016 1:46 PM | Updated on Sep 26 2018 6:49 PM

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిషేధిత గుట్కా పాన్‌ మసాలా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను శనివారం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిషేధిత గుట్కా పాన్‌ మసాలా విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారులను శనివారం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.40 లక్షల రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు వన్‌టౌన్ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ నగేష్‌బాబు శనివారం మధ్యాహ్నం దాడి చేశారు. సుధాకర్‌గుప్తా, సుగయ్యా అనే ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి దుకాణాల్లో ఉన్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement