కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు: రోజా | Roja blasts On Kiran Kumar Reddy completes 3 years as CM | Sakshi
Sakshi News home page

కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు: రోజా

Nov 25 2013 1:01 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు: రోజా - Sakshi

కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు: రోజా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్  తెలుగు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. చంద్రబాబుతో కలిసి కిరణ్ రాష్ట్రాన్ని విడగొట్టాలని చూస్తున్నారని రోజా విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన సువర్ణయుగం అయితే కిరణ్ పాలన చంద్రబాబు-2 పరిపాలన అని ఆమె వ్యాఖ్యానించారు.

మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చారే కానీ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని రోజా సూటిగా ప్రశ్నించారు. ప్రచారానికి పెట్టిన ఖర్చులో ఒక్క వంతైనా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించారా అని అన్నారు. తెలుగు జాతి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టామంటూ.. సీఎం కిరణ్ ప్రకటనలు సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి  మాటలను ఆయన భార్య కూడా ఒప్పుకోరని రోజా అన్నారు. చంద్రబాబును ముఖ్య సలహాదారుగా పెట్టుకుని కిరణ్ పాలిస్తున్నారని ఆమె ఆరోపించారు. చివరి రోజుల్లో అయినా కిరణ్ ప్రజలకు సేవ చేయాలని... లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని రోజా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement