విశాఖ ప్రమాదం: నేతల స్పందన

RK Roja Express Shock Over Vizag Chemical Leak Incident - Sakshi

సాక్షి, విజయవాడ/గుంటూరు: వైజాగ్‌లో విషవాయువు లీకైన ఘటనపై ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ప్రమాదకర రసాయన వాయువు బయటకు రావడంతో 8 మంది చనిపోయారు. చాలా మంది రసాయన వాయువు ప్రభావానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

హోంమంత్రి సుచరిత దిగ్భ్రాంతి
విశాఖ ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం కలెక్టర్, మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, విపత్తు నివారణ శాఖ డీజీ అనురాధలతో మాట్లాడారు. సహాయకచర్యలను, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గ్యాస్ లీక్ ఆగిపోయింది..
విశాఖ ప్రమాదంపై సకాలంతో అధికారులు స్పందించి, బాధితులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి ప్రమాదకర రసాయన వాయువు లీక్ ఆగిపోయింది.. పరిస్థితి అదుపులో ఉందని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. (మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు)
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top