ఒంటరిగా నివసిస్తున్న రిటైర్‌డ వీఆర్‌ఏ గురజ మహాలక్ష్మి (75) హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం..
కూళ్ల (కె.గంగవరం) : ఒంటరిగా నివసిస్తున్న రిటైర్‌డ వీఆర్‌ఏ గురజ మహాలక్ష్మి (75) హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూళ్లలోని ఎస్సీ కాలనీలో మహాలక్ష్మి ఒంటరిగా నివసిస్తున్నాడు. తనకు వచ్చే పెన్షన్‌తోనే జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో అతడు పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉంటున్న గుండపు సత్యనారాయణ కుమారుడు శ్రీనుతో చిన్న తగాదా ఏర్పడింది. ఈ నేపథ్యంలో కర్రతో మహాలక్ష్మిపై శ్రీను విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మహాలక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరణించాడు.
అతడి మనవడు ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇలాఉండగా శ్రీను మానసిక స్థితి సక్రమంగా లేదని స్థానికులు పేర్కొన్నారు. గతంలో పలుమార్లు ఇతరులపై దాడి చే శాడని తెలిపారు. ఎస్సై జి.నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాఉండగా మహాలక్ష్మి నేత్రాలను ఆయన మనవడు ప్రవీణ్ కాకినాడ బాదం బాలకృష్ణ ఐ-బ్యాంకుకు దానం చేశారు. ప్రవీణ్ కూడా వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు.