‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’ | 'Regions separated or estranged' | Sakshi
Sakshi News home page

‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’

Jan 18 2015 3:20 AM | Updated on Sep 2 2017 7:49 PM

‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’

‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’

తెలుగు ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదని తమిళనాడు గవర్నరు కె.రోశయ్య అన్నారు.

విశాఖపట్నం: తెలుగు ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదని తమిళనాడు గవర్నరు కె.రోశయ్య అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు లోక్‌నాయక్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

అలాగే ఫ్రాన్సు విశ్వవిద్యాలయ తెలుగు భాషాచార్యులు డేనియల్ నిగర్స్, కెనడాలో బంజారా ఇండియా రెస్టారెంట్ల నిర్వహణ ద్వారా తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వీరెళ్ల రాజేశ్వరరావులకు జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, సంస్కృతిని బతికించాలనే లక్ష్యంతో  పురస్కారాలు అందించడం అభినంద నీయ మన్నారు.

ఈ పురస్కారం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని లోక్‌నాయక్ పురస్కార గ్రహీత గొల్లపూడి మారుతీరావు చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జస్టిస్ జి.రఘురామ్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీలు ఎంవీవీఎస్ మూర్తి, సబ్బం హరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement