breaking news
Gollapudi marutiravu
-
గురజాడ భవన్ నిర్మాణంలో అలసత్వం తగదు
- మున్సిపల్ కౌన్సిల్ తీరుపై గొల్లపూడి ఆవేదన విజయనగరం ప్రముఖ సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పేరుతో విజయనగరంలో స్మారక భవనాన్ని నిర్మించడంలో అలసత్వం సరికాదని ప్రముఖ కవి, నటుడు గొల్లపూడి మారుతీరావు అన్నారు. గురజాడ స్మారక భవన నిర్మాణంపై మునిసిపల్ కౌన్సిల్లో ప్రతిపాదన వస్తే తిరస్కరించడం విచారకరమన్నారు. సోమవారం విజయనగరంలోని గురజాడ స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొల్లపూడి మాట్లాడారు. గురజాడ స్మారక భవనం కోసం ఉద్యమం చేస్తామనడంతో కౌన్సిల్లో ప్రతిపాదన పెడతామని ఇప్పటికైనా చెప్పడం సంతోషకరమన్నారు. గురజాడ స్వగృహాన్ని ఆధునికీకరించి దాన్ని స్మారక భవనంగా అభివృద్ధి చేయాలన్నారు. గురజాడ భవన్ పరిరక్షణ కోసం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా నిరంతరం కృషి చేయాలని సూచించారు. గురజాడ భవన్ ఆ నాటి జ్ఞాపకాలను తెలియజేసేదిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత రామతీర్థ మాట్లాడుతూ... 13 జిల్లాల్లోనూ గురజాడ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో చిరంజీవి కుటుంబం
- సినీ రాజకీయ ప్రముఖులు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సోమవారం కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం దర్శించుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారైతో ఇటీవలే వివాహమైన చిన్నకుమార్తె శ్రీజ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారికి పూజలు నిర్వహించారు. సోమవారం పలువురు ప్రముఖులు వెంకన్న దర్శనం కోసం వచ్చారు. వీరిలో ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత, సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు ఉన్నారు. రేపటి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు సాగే ఉత్సవాల్లో స్వామివారు వసంతమండపంలో ప్రత్యేక తిరుమంజన పూజలందుకుంటారు. రెండో రోజున శ్రీవారి స్వర్ణరథోత్సంలో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమివ్వనున్నారు. -
ఆచారం-అపచారం
జీవన కాలమ్ నాకేమో చక్రవర్తి రాజగోపా లాచార్యులుగారు, ఎం.జి. ఆర్., కరుణానిధిగారు ఎల్ల ప్పుడూ నల్లకళ్లద్దాలు పెట్టుకో వడం ఎబ్బెట్టుగా అనిపిస్తుం ది. అయితే వారికి ఏ కంటి జబ్బులో, మరేవో కారణాలు ఉండవచ్చు. కాగా, ఈ ముగ్గు రు నాయకులూ తమిళనాడు వారే కావడం మరో విశేషం. ఒకే రకం జబ్బున్న లేదా అలవాటున్న ముగ్గురు గొప్ప నాయకుల రాష్ట్రమది. ఏది చేసినా చేయకపోయినా కన్ను ఎదుటి వ్యక్తి పట్ల మన మర్యాదనీ, గౌర వాన్నీ, అభిమానాన్ని - ఇన్నింటిని సూచి స్తుంది. కన్ను మన వ్యక్తిత్వాన్ని, శీలాన్ని ఆవిష్కరించే కిటికీ. కనుక కళ్లను దాచిపెట్టి ఎదుటి వ్యక్తిని పలకరించడం కాస్త అపచా రమే. ఇలాంటి అపచారాన్ని మొన్న ఛత్తీస్ గఢ్కి ప్రధాని వచ్చినప్పుడు ఇద్దరు కలెక్టర్లు చేశారు. వీరు మర్యాదల గురించీ, విధుల గురించీ, సంప్రదాయాల గురించీ సశాస్త్రీ యంగా తర్ఫీదు పొందినవారు. అయినా మొన్న బస్తర్ కలెక్టరు సతీష్ కటారియాగారు, దంతెవాడ కలెక్టరు దేవ సేనాపతిగారు - ఇద్దరూ ప్రధాని పర్యటనలో ఒకే రక మయిన సంప్రదాయ ఉల్లంఘన చేశారు. పాపం, తొడు క్కోడానికి వారిద్దరూ బంద్గాలాలు తెచ్చుకున్నారు. ఆ కారణంగానే టైలు తెచ్చుకోలేదు. ఎండ ఎక్కువగా ఉం డటంవల్లనూ, హుటాహుటిన ప్రధాని రావడం వల్లనూ- వారు బంద్గాలాని ధరించలేదు. ముఖ్యంగా నల్లకళ్లద్దాలను తీసేయలేదు. ఆ దృశ్యం- సినీమాకు భార్యతో వెళ్తూ దారిలో కనిపించిన పెద్ద మనిషి - ప్రధానిని - వారు సరదాగా పలకరించినట్టు కని పించింది. ఇది అపచారమని రాష్ట్ర ప్రభుత్వం వారిని హెచ్చరించింది. అలనాడు- కొలువుల్లో పనిచేసిన వారూ, ప్రజా జీవితాన్ని గడిపిన వారూ చాలా మంది పెద్దలు తల పాగాలతో కనిపించడం చూస్తూనే ఉంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సి.పి.రామ స్వామి అయ్యర్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ముట్నూరి కృష్ణారావు, పారుపల్లి రామకృష్ణయ్య, వీణ వెంకట రమణదాసు, బాలగంగాధర తిలక్, లాలా లజ పతిరాయ్, మదనమోహన్ మాలవ్యా, స్వామి వివేకా నంద, నాటకాలకి కాక ప్రజల మధ్యకి వచ్చేటప్పుడు అద్దంకి శ్రీరామమూర్తిగారు తలపాగా చుట్టుకునేవారు. ఒక సంప్రదాయానికి కట్టుబడిన తరమది. తాను ప్రజలకు ప్రధాన సేవకుడినని మోదీగారు పదే పదే చెప్పుకుంటూంటారు. ఆ లెక్కన ప్రజాసేవకు ఉద్యోగం చేస్తున్నవారు వీరిద్దరూ. పైగా ఇలాంటి మర్యా దలు ఆలిండియా సర్వీసు నిబంధనలలో ఒక భాగం. నాకెప్పుడూ పెద్దపెద్ద సభల్లో ప్రసంగిస్తున్న ప్రధాని, ముఖ్యమంత్రి వెనుక నల్లకళ్లద్దాలు పెట్టుకుని నిలబడే ఇద్దరు ఆఫీసర్లు అపశ్రుతిలాగ కనిపిస్తూంటారు. అయితే రహస్య పరిశోధకశాఖకు చెందిన వారి పని -తామెటు, ఎవరిని చూస్తున్నారో తెలియకుండా అందరినీ కనిపెట్ట డమేనని జ్ఞప్తికి వచ్చినప్పుడు రాజీపడతాను. ఒక ముఖ్యమైన సంఘటన. 1982 ఏప్రిల్‌లో నటుడినయ్యాను. నా రెండో సినీమా క్రాంతికుమార్ ‘ఇది పెళ్లంటారా?’. ఆ సినీమాలో నా పాత్రకి మాసిన గెడ్డం ఉండాలి. పెంచమన్నాడు క్రాంతికుమార్. నేను కడప రేడియో స్టేషన్‌కి ఇన్చార్జిని. ఆ రెండు మూడు నెలల్లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిగారు అనంత పూర్ వచ్చారు. ఆ సందర్భంలో స్థానిక సంస్థల అధిప తులు అక్కడ నిలవడం మర్యాద. నేనూ వెళ్లాను. ప్రొటో కాల్ ఆఫీసరు నన్ను చూసి, నా మాసిన గెడ్డం చూసి ఇబ్బంది పడిపోయాడు. నా కారణాలు చెప్పాను. ఆయ న అంగీకరించలేకపోయాడు. నన్ను రెండో వరసలో నిల బెట్టాడు. అదృష్టవశాత్తూ ఆ పర్యటనలో నా ప్రమే యం- కేవలం లాంఛనం తప్ప ఏమీలేదు. తీరా సంజీ వరెడ్డిగారు హెలికాప్టర్ దిగి సరాసరి కారు దగ్గరికి వెళ్లి ఎక్కేశారు. అది ప్రైవేట్ రాక అని గుర్తు. అలాంటి పర్యటనకి ప్రొటోకాల్ పట్టింపు ఎక్కువ ఉండదేమో. ఏమయినా ప్రభుత్వపరంగా సేవా ధర్మం నీచమయిన మాటకాదు. ఈ దేశపు ప్రధాని ముందు నిలిచినప్పుడు- బాధ్య తాయుతమైన జిల్లా అధికారి - పది మం దికి మార్గదర్శకం కావలసిన అధికారి- లాంఛనాలను పాటించకపోవడం అప శ్రుతి. కొన్ని లాంఛనాలు వ్యవస్థకి ఒక గౌరవాన్నీ, గాం భీర్యాన్నీ ఇస్తాయి. కొన్నింటిని పాటించడం ఆయా స్థాయిలలో తప్పనిసరి. ఒక ప్రముఖ వ్యక్తి వచ్చినప్పుడు లేచి నమస్కరిం చడం మర్యాద. నమస్కరించకపోతే? ఒక విలువ దెబ్బ తింటుంది. అంతే. అయితే ఒక అధికారికి మరో అధికారి ఇవ్వాల్సిన మర్యాద - కేవలం మర్యాద మాత్రమే కాదు. ఒక సంప్రదాయ పరిరక్షణ. బాధ్యత. ఇవ్వకపోతే? ఒక వ్యవస్థ గాంభీర్యం దెబ్బతింటుంది. తర్వాత ఏం జరుగు తుందన్నది వేరే విషయం. అది అరాచకం. గొల్లపూడి మారుతీరావు -
‘ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదు’
విశాఖపట్నం: తెలుగు ప్రాంతాలు వేరుపడినా భాష వేరుపడదని తమిళనాడు గవర్నరు కె.రోశయ్య అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావుకు లోక్‌నాయక్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అలాగే ఫ్రాన్సు విశ్వవిద్యాలయ తెలుగు భాషాచార్యులు డేనియల్ నిగర్స్, కెనడాలో బంజారా ఇండియా రెస్టారెంట్ల నిర్వహణ ద్వారా తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వీరెళ్ల రాజేశ్వరరావులకు జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, సంస్కృతిని బతికించాలనే లక్ష్యంతో పురస్కారాలు అందించడం అభినంద నీయ మన్నారు. ఈ పురస్కారం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని లోక్‌నాయక్ పురస్కార గ్రహీత గొల్లపూడి మారుతీరావు చెప్పారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జస్టిస్ జి.రఘురామ్, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ ఎంపీలు ఎంవీవీఎస్ మూర్తి, సబ్బం హరి పాల్గొన్నారు.