ఆర్టీఏ అధికారుల దాడులు | RDA attacks on officials | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అధికారుల దాడులు

Dec 18 2013 3:08 AM | Updated on Sep 2 2017 1:42 AM

నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సుల యాజ మాన్యాలపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝళిపించి 8 బస్సులను సీజ్ చేశారు.

కడప అర్బన్, న్యూస్‌లైన్ : నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సుల యాజ మాన్యాలపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝళిపించి 8 బస్సులను సీజ్ చేశారు. కలెక్టర్ శశిధర్ సూచించిన నిబంధనలను పాటించలేదని, స్టేజి క్యారియర్లను నిర్వహిస్తున్నార నే సమాచారంతో మంగళవారం ఎంవీఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో  నగర శివార్లలో ట్రావెల్స్ బస్సులను, రికార్డులను పరిశీలించారు.
 
 బస్సుల్లో స్మోక్ డిటెక్టర్స్, అగ్నిమాపక నివారణ పరికరం, కనీసం రెండు సుత్తులు (హ్యామర్స్) అమర్చుకోలేదని గమనించారు. 8బస్సులను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. వాటనన్నింటిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు కోర్టు ద్వారానే బస్సులను విడుదల చేసుకోవాల్సి ఉంది. ఈనెల 16వ తేదీన ఏఎంవీఐ హేమకుమార్ ఆధ్వర్యంలో రెండు బస్సులను సీజ్ చేశారు. వీటిని కడప డిపో ఆవరణలో ఉంచారు. ఎంవీఐ శ్రీకాంత్ మాట్లాడుతూ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలను పాటించాలని, లేకుంటే దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement