పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం | Rape Attempt On 10th Class Girl In anantapuram | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

Apr 13 2017 11:24 AM | Updated on Jul 28 2018 8:53 PM

పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

అయిదుగురు  అరెస్ట్‌
కదిరి(అనంతపురం): పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లాలోని కదిరికి చెందిన పదో తరగతి విద్యార్థినిని స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పరీక్షలు రాయడానికి వచ్చిన బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం జరిపాడు.
 
ఈ అంశంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement