tenthclass student
-
10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!
బెంగళూరు: ‘పాస్ అయ్యేందుకు లంచమా?!’ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఆన్సర్ షీట్లలో నోట్లు పెట్టి, పాస్ చేయమంటూ ఇన్విజిలేటర్లను అభ్యర్థించిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండికర్ణాటక రాష్ట్రం (Karnataka) బెల్గావి జిల్లా చిక్కోడిటౌన్‌లో పదోతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకనం చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ పదోతరగతి పరీక్షాపేపర్ల మూల్యాంకనం సమయంలో పలువురు ఇన్విజిలేటర్లకు ఆన్సర్ షీట్లలో కరెన్సీ నోట్లు తారసపడ్డాయి. దీంతో కంగుతిన్న ఇన్విజిలేటర్లు ఆన్సర్ షీట్లలో ఈ కరెన్సీ నోట్లు ఎందుకు వచ్చాయా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.‘సార్.. సార్ నన్ను పాస్ చేయండి. మీ దణ్ణం పెడతా. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. సార్ ఇవిగో రూ.500 ఛాయ్ తాగండి.. నన్ను పాస్ చేయండి. నన్ను పాస్ చేయించలేదనుకో అంటూ ఇలా విద్యార్థులు ఎగ్జామ్స్ ఆన్సర్ షీట్ల మీద పలువురు విద్యార్థులు ప్రాధేయపడుతూ రాశారు. వారిలో ఓ పదో తరగతి విద్యార్థి తన ఆన్సర్ షీట్ మీద రూ.500 నోటు పెట్టి పాస్ చేయమని అభ్యర్థించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రిక్వెస్ట్ చూసిన ఓ ఇన్విజిలేటర్ ‘మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు’ అంటూ ఆ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ విద్యార్థి రూ.500 నోటు ఇస్తే మరికొందరు విద్యార్థులు తమకు పలు రిక్వెస్టులు చేసినట్లు చీక్కోడి టౌన్లో పదో తరగతి పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. వాటిల్లో విద్యార్థులు అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ప్లీజ్ పాస్ చేయండి సార్. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.నేను పాసాయితే నా ప్రేమను కొనసాగిస్తాసార్ ఇదిగో రూ.500 .. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండిమీరు నన్ను పాస్ చేయిస్తే .. నేను మీకు డబ్బులిస్తానేను పాస్ కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరూ అని ఆన్సర్ షీట్లో రాశారు.చివరికి పలువురు ఇన్విజిలేటర్లు ఆ ఆన్సర్ షీట్లలోని కరెన్సీ నోట్లను ఉన్నతాధికారులకు అందించారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ల ఆధారంగా మార్కులు వేశారు. -
'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం'
సాక్షి, గుంటూరు : జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సౌమ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి శనివారం ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'వరప్రసాద్ ప్రేమ వేధింపులకు గురై సౌమ్య చనిపోవడం బాధాకరం. సౌమ్య మృతిపై ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాం.. వారి బాధ వర్ణణాతీతం. ఈ విషయం ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించిన సౌమ్య ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా డాక్టర్లు సౌమ్యను బతికించడానికి తీవ్రంగా కృషి చేశారు. వెంటిలేటర్ పై ఉన్నప్పుడు తాను పడ్డ బాధను సౌమ్య వీడియోలో చెప్పింది.(చదవండి :‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’) సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే పోలీసులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారం రోజులలో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేస్తారు. గ్రామంలో ఆకతాయిలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మా దృష్టి కి తెచ్చారు.. వెంటనే పికెట్ ఏర్పాటు చేయమని పోలీసులను ఆదేశించాం. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయంను అందిస్తాం. మహిళల రక్షణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఒంగోల్ లో జరిగిన భువనేశ్వరి సజీవదహనం అనుమానాస్పదంగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒంగోలు వెళ్తున్నానంటూ ' తెలిపారు. -
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
అయిదుగురు అరెస్ట్ కదిరి(అనంతపురం): పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. జిల్లాలోని కదిరికి చెందిన పదో తరగతి విద్యార్థినిని స్థానికంగా నివాసముంటున్న ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి పరీక్షలు రాయడానికి వచ్చిన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపాడు. ఈ అంశంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.