కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు | Rain Alerts In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

Oct 19 2019 3:47 PM | Updated on Oct 20 2019 4:12 PM

Rain Alerts In Andhra Pradesh - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె, పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, వినుకొండలలో కుండపోత వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమ​యమయ్యాయి. క్రోసూరు ఎస్టీకాలనీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అధ్వర్యంలో 150 కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలో భోజన, వసతి ఏర్పాట్లు చేశారు.

విశాఖపట్నం : కోస్తాంధ్ర జిల్లాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ నగరంలో భీమిలి, యలమంచిలి, తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామం వద్ద కాజ్ వే మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement