చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా | raghuveera reddy criticises chandrababu ruling in ap | Sakshi
Sakshi News home page

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా

Aug 6 2017 5:49 PM | Updated on Aug 29 2018 6:00 PM

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా - Sakshi

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితులకు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు.

విజయవాడ:  బాధిత దళితులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో రాష్ట్రంలో దళితలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై టీడీపీ నేతల దాడులని ఖండిస్తున్నామని చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని రఘువీరా ధ్వజమెత్తారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను మూడేళ్లయిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హాదాపై ఇచ్చిన మాటను ప్రధాని నరేంద్ర మోదీ తప్పారని విమర్శించారు. మోదీ మాట తప్పినందుకు రేపు (సోమవారం) నిరసన కార్యక్రమాలు చేపడతామని రఘువీరారెడ్డి తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా మోదీకి నిరసన రాఖీలు పంపనున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement