ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం! | Sakshi
Sakshi News home page

ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం!

Published Wed, Jul 9 2014 11:00 AM

ఇక రెండు గంటల్లో వెంకన్న దర్శనం! - Sakshi

కడప : నెల రోజుల్లో తిరుమలలో సామాన్య భక్తుడు  రెండు గంటల్లో స్వామివారిని దర్శించుకునేలా చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.  ఆయన బుధవారం వైఎస్ఆర్ జిల్లాలో దేవుని కడప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి సత్వర దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే భూకబ్జాకు గురైన దేవాలయ భూముల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement