సీమాంధ్రలో త్రైమాసిక పరీక్షలు వాయిదా | Quarterly exams postponed in seemandhra districts | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో త్రైమాసిక పరీక్షలు వాయిదా

Sep 17 2013 1:36 AM | Updated on Sep 26 2018 3:25 PM

పాఠశాలల్లో ఈనెల 25 నుంచి జరగాల్సిన త్రైమాసిక పరీక్షలను సీమాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

పాఠశాలల్లో ఈనెల 25 నుంచి జరగాల్సిన త్రైమాసిక పరీక్షలను సీమాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే తెలంగాణ జిల్లాల్లో మాత్రం పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని నిర్ణయించింది.

ఓయూ పరిధిలో పరీక్షలు కూడా...
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 17, 18న నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. వీటిని ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే వెల్లడిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణ విలీన దినం, గణేష్ నిమజ్జనాలే వాయిదాకు కారణమని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement