'కమ్మ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలి' | puttaparthi tdp leaders unsatisfied on Minister Palle raghunatha reddy | Sakshi
Sakshi News home page

'కమ్మ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలి'

Jul 4 2014 8:58 AM | Updated on Aug 10 2018 9:40 PM

మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం : మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి మండలాధ్యక్ష పదవిని కమ్మ సామాజిక వర్గానికే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటా మూకుమ్మడి రాజీనామాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

 

పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మంత్రి పదవి పొందిన పల్లె రఘునాథరెడ్డి ఎంపీపీ పదవుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం సరిగా లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులను, కార్యకర్తలను నిరాదరణకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  దీంతో స్థానిక సంస్థల పదవులు టీడీపీలో పెద్ద దూరామాన్నే లేపాయనే చెప్పవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement