'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి' | Prakash karat demands government to declare Cyclone Hudhud as National Calamity | Sakshi
Sakshi News home page

'హుదూద్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి'

Nov 2 2014 11:13 AM | Updated on Aug 13 2018 8:10 PM

ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు.

తుపాను వల్ల స్టీల్ ప్లాంట్కు జరిగిన నష్టంపై ఆ సంస్థ ఉన్నతాధికారులను కారత్ అడిగి తెలుసుకున్నారు. హుదూద్ తుపాను ముంచుకోస్తుందని తెలిసిన అధికార్లు నిర్లక్ష్యం ఉందన్న వార్తలపై విచారణ జరిపించాలని కారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్తో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని ప్రకాష్ కారత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement