నల్లమలలో కూంబింగ్ | police cumbing in nallamala forest: 6 arrested | Sakshi
Sakshi News home page

నల్లమలలో కూంబింగ్

Nov 30 2015 8:40 AM | Updated on Sep 3 2017 1:16 PM

కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.

కర్నూలు: కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. నల్లమలలో స్మగ్లర్ల కదిలిక నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం జరిపిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు పట్టుకున్నారు. రవాణా చేస్తున్న 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కూలీలు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement