పేకాట క్లబ్‌లపై పోలీసుల దాడులు - ప్రముఖుల అరెస్టు | Playing Cards Gang Arrested In Eluru | Sakshi
Sakshi News home page

పేకాట క్లబ్‌లపై పోలీసుల దాడులు - ప్రముఖుల అరెస్టు

Dec 30 2017 11:10 PM | Updated on Sep 17 2018 6:26 PM

Playing Cards Gang Arrested In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు : అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌లపై ఏలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా పేకాట క్లబ్‌ నిర్వహిస్తున్నారనే పక్కాసమాచారం అందుకున్న పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు జరిపారు. ఎస్పీ రవిప్రకాశ్‌ ఆదేశాలతో డీఎస్పీ ఈశ్వర రావు ఈ దాడులు నిర్వహించారు. టీడీపీ నేతల అండదండలతో ఈపేకాట క్లబ్‌ సాగుతున్నట్లు సమాచారం. ఈదాడుల్లో 16 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా రూ.21.50లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు రెండుగంటలపాటు తలుపులు మూసి సోదాలు సాగినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే తెలుగుదేశం నాయకుల ఒత్తిడి మేరకు ప్రముఖులను తప్పించే యత్నం జరుగుతోంది. అయితే సమాచారం అందుకున్న విలేకరులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారం అడగ్గా పోలీసులు నిరాకరించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement