రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Feb 12 2016 1:24 AM | Updated on Aug 30 2018 3:58 PM

పట్టణంలోని వేగావతి నది వంతెనపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాచిపెంట మండలం మోసూరు

సాలూరు: పట్టణంలోని వేగావతి నది వంతెనపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన అప్పికొండ తిరుపతి(47) మృతిచెందాడు. తిరుపతి తన ద్విచక్రవాహనంపై సాలూరు నుంచి మోసూరు వెళ్తుండగా వంతెన వద్ద వాహనాన్ని అదుపుచేయలేక కిందపడి ఉంటాడని, బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వీడి వుంటాడని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
  అయితే రోడ్డుకు కుడివైపు వాహనం, మృతదేహం పడివుండటంతో ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కిందపడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. పట్టణ ఎస్‌ఐ పరంజ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement