ఇసుక మాఫియాకు చెక్

మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటు న్నామని పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియాను నియంత్రించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా చేసేవారికి రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఇసు కకు ఎక్కడా కొరత లేదని, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి