వైద్యులు ఉండరు..వైద్యం అందదు | No doctors for emergency cases | Sakshi
Sakshi News home page

వైద్యులు ఉండరు..వైద్యం అందదు

Oct 28 2013 4:13 AM | Updated on Sep 2 2017 12:02 AM

నిరుపేదలకు అధునాతన వైద్యం అందించాలని ఏర్పాటు చేసిన సముదాయ (క్లస్టర్) ఆస్పత్రి విధానం జిల్లాలో అభాసుపాలవుతోంది.

 భువనగిరి, న్యూస్‌లైన్:  నిరుపేదలకు అధునాతన వైద్యం అందించాలని ఏర్పాటు చేసిన సముదాయ (క్లస్టర్) ఆస్పత్రి విధానం జిల్లాలో అభాసుపాలవుతోంది.  2010లో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రోగులకు 24గంటలూ అవసరమైన వైద్యం అందించాలని నిర్ణయించారు. అయితే స్థానికంగా వైద్యులు ఉండకపోవడం.. మందుల కొరత, సిబ్బంది లేమి వంటి కారణాలతో ఈ వ్యవస్థ అలంకారప్రాయంగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 15 క్లస్టర్లుగా విభజించారు. వాటి ద్వారా పేదలకు వైద్యం మరింత చేరువ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతి క్లస్టర్‌కు సీనియర్ మెడికల్ ఆఫీసర్‌ను అధికారిగా నియమించా రు.
 
 ఆయన ఆయా క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అంటువ్యాధులు రాకుండా ముందస్తు నివారణ చర్యలు, జ్వరాలు, చిన్న పిల్లల ఆరోగ్యం, ప్రసవాలను పర్యవేక్షించాల్సి ఉంది. ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్‌సీలు, క్లస్టర్‌లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా నియమించారు. అదే విధంగా చిన్నపిల్లల, గర్భకోశ, మత్తు, ఎముకల స్పెషలిస్టులతోపాటు అత్యవసర విభాగాల్లో రెండు పోస్టులను భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యం అందుబాటులో ఉండడం లేదు.
 
 పోచంపల్లిలో ఒక్కరే డాక్టర్
 పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. వైద్యురాలు నెలలో 15 రోజుల పాటు 104లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోడాక్టర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. డాక్టర్ స్థానింగా ఉండకపోవడం వల్ల స్టాఫ్‌నర్స్ ఇతర సిబ్బంది వైద్యం అందిస్తారు. ఇక.. బొల్లేపలి,్ల వర్కట్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు వచ్చినప్పుడే రోగులు రావాలి. వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇటీవల వర్కట్‌పల్లి పీహెచ్‌సీ తనిఖీ కోసం వచ్చినప్పుడు వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితి అన్ని పీహెచ్‌సీల్లోనూ ఉంది.
 
 జిల్లాలో ఏర్పాటైన క్లస్టర్లు
     భువనగిరి : బొల్లేపల్లి, బీబీనగర్, కొం డమడుగు, బొమ్మలరామారం, తు ర్కపల్లి, ఆత్మకూర్(ఎం), గుండాల
     రామన్నపేట : మునిపంపుల, చిట్యాల, వలిగొండ, వేములకొండ, మోత్కూరు, అడ్డగూడూర్
     ఆలేరు : రాజాపేట, శారాజీపేట, యాదగిరిగుట్ట, మోటకొండూర్
     చౌటుప్పల్ : వర్కట్‌పల్లి, పోచంపల్లి, నారాయణపురం, వెల్మినేడు
     నల్లగొండ : నల్లగొండ, కనగల్, గుర్రంపోడ్, తిప్పర్తి, నార్కట్‌పల్లి, అక్కినేపల్లి, మునుగోడు
     నాగార్జునసాగర్ : హాలియా, నిడమనూరు, పెద్దవూర
     దేవరకొండ : డిండి, చందంపేట, పీఏపల్లి, గుడిపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి
     హూజర్‌నగర్ : మేళ్లచెరువు, మఠంప ల్లి, లింగగిరి, గరిడేపల్లి, కల్మల్‌చెరువు
     నకిరేకల్ : కేతేపల్లి, శాలిగౌరారం, ఓగోడు, కట్టంగూర్
     మర్రిగూడ : మర్రిగూడ, చండూరు, నాంపల్లి, వి.టి.నగర్
     మిర్యాలగూడ : ఆలగడప, వేముల పల్లి, త్రిపురారం, పెద్దదేవులపల్లి, దా మరచర్ల, నేరడుచర్ల, పెంచికల్ దిన్నె
     కోదాడ : అనంతగిరి, కాపుగల్లు, చిలుకూరు
     నడిగూడెం :త్రిపురవరం, మునగాల, రేపాల
     సూర్యాపేట : కాసరాబాద, ఆత్మకూర్.ఎస్, పెన్‌పహాడ్, మోతె, పాములపహాడ్, చివ్వెంల
     తుంగతుర్తి : తుంగతుర్తి, అర్వపల్లి. నూతనకల్, నాగారం, తిరుమలగిరి
 అందుబాటులో లేని వైద్యం :
 గోద శ్రీనివాస్ , సర్పంచ్ బొల్లేపల్లి : మా గ్రామంలో ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యు లు, సిబ్బంది సరిగా విధులకు హాజరుకారు. డాక్టర్ ఎప్పుడు వస్తుందో ఎప్పు డు పోతుంతో తెలియదు. సిబ్బంది కూ డా అదే పరిస్థితి. ప్రజలకు అందుబాటు లో ఉండాలని ఇటీవల నేను చెప్పినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అధికారు లు గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement