కొత్త ఎస్పీగా శివకుమార్ | New S.P Shiva kumar in karimnagar district | Sakshi
Sakshi News home page

కొత్త ఎస్పీగా శివకుమార్

Oct 28 2013 2:28 AM | Updated on Aug 18 2018 4:13 PM

కరీంనగర్ కొత్త ఎస్పీగా ఉప్పుల శివకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రవీందర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు.

సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కొత్త ఎస్పీగా ఉప్పుల శివకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రవీందర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శివకుమార్ ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. గ్రూప్-1కు ఎంపికైన ఆయన 1994లో డీఎస్పీగా నియమితులయ్యా రు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో తొలి పోస్టింగ్ పొందారు. తర్వాత ఆవనిగడ్డ, కరీంనగర్‌లో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై విజయనగరంలో అదనపు ఎస్పీగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలోబాధ్యతలు నిర్వర్తించారు. కోసావో ఐక్యరాజ్య సమితి మిషన్‌లో పనిచేశారు.
 
 ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఈ ఏడాది జనవరి 1న మల్కాజిగిరిడీసీపీగా బదిలీ అయ్యారు. అక్కడ పది నెలలు పనిచేసి.. కరీంనగర్ ఎస్పీగా వస్తున్నారు. 1952 జూలై 9న వరంగల్‌లో జన్మించిన ఆయన.. వరంగల్ నిట్‌లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఐదేళ్లపాటు ఇంజినీరింగ్ పనిచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement