చంద్రబాబుకు నెటిజన్ల ప్రశ్నల వర్షం

చంద్రబాబుకు నెటిజన్ల ప్రశ్నల వర్షం


హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్లో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.  'దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాము' అని చంద్రబాబు ట్విట్టర్ఓలో పోస్ట్ చేసిన మరుక్షణం కామెంట్లు వెల్లువెత్తాయి.అవినీతి, లంచగొండితనాలపై  ఈ సోది వద్దని, రేవంత్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంటి? మీ కామెంట్ ఏంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.  ముందుగా రేవంత్ రెడ్డి ముడుపుల అంశానికి సంబంధించి ఎందుకు స్పందించరంటూ ప్రశ్నించారు. మీ శిక్షణలో రేవంత్ బాబు ఎలా ఉన్నాడంటూ మరో నెటిజన్ ట్విట్ చేయగా, ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఆపండంటూ మరొకరు ట్విట్ చేశారు.


             Today is #NavaNirmanaDeeksha. We, the people of AP, stand hand-in-hand & pledge to transform our state into a healthy, happy & Sunrise AP.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top