వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం.. 52 మందిని విచారించిన సిట్‌

Murder Attempt On YS Jagan SIT Inquired 52 Members - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిట్‌ ఇప్పటి వరకు 52మందిని విచారించింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో సిట్‌ విచారణ జరిపింది. నిందితుడు శ్రీనివాసరావు ఎక్కువగా మాట్లాడినట్లు నిర్థారనకు వచ్చిన 321మంది కాలర్స్‌తో మాట్లాడిన సిట్‌ వారి స్టేట్‌మెంట్స్‌ను రికార్డు చేసింది.

శుక్రవారం విచారణ జరపాల్సిందేమీ లేదని సిట్‌ అధికారులు తెలిపారు. కోర్టుకి సబ్‌మిట్‌ చేసేందుకు రికార్డు వర్కు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కస్టడీ పొడిగింపుపై ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు లైవ్‌ డిటెక్టర్‌ పరీక్ష కోసం నిందితుడి అభిప్రాయం రికార్డు చేయబోతున్నట్లు చెప్పారు.

సిట్‌ అధికారులు! నిందితుడు శ్రీనివాసరావు అంగీకరిస్తే కోర్డులో పిటిషన్‌ వేయనున్నారు. జగన్‌ షర్టు ఇప్పించాలని కోరుతూ వేసిన పిటిషన్‌తో పాటు ప్లెక్సీ, 11 పేజీల లేఖ పరీక్షించేందుకు, ఫోరెన్సిక్‌ లాబ్‌కు పంపేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. సిట్‌ అధికారులు నిందితుడికి మధ్యాహ్నం స్టేషన్‌లోనే కేజీహెచ్‌ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరుచనున్నారు. అనంతరం అక్కడినుంచి సెంట్రల్‌ జైలుకి నిందితుడ్ని తరలించనున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top