చంద్రబాబుకు ముద్రగడ లేఖ

Mudragada Padmanabham Letter To Chandrababu Naidu - Sakshi

సాక్షి, కాకినాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  లేఖ రాశారు. కాపులకు తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ చంద్రబాబుకు శనివారం లేఖ రాశారాయన.  లేఖలో.. గవర్నర్‌ ఆమోదంతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయోచ్చని మేథావులు, న్యాయవాదులు సలహా ఇస్తున్నారని పేర్కొన్నారు. బిల్లు కేంద్రానికి పంపేశాను.. నా పని  అయిపోయిందని తప్పుకోవద్దని సూచించారు. చంద్రబాబు ఆలోచన బస్సు, రైలు వెళ్లిపోయాక స్టేషన్‌కు వచ్చినట్లుందని ఎద్దేవాచేశారు. అలా ఆలోచించకూడదని ముద్రగడ పద్మనాభం అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top