'ముద్రగడపై కేసులు పెట్టడం రెచ్చగొట్డడమే' | mudragada padmanabham-deeksha | Sakshi
Sakshi News home page

'ముద్రగడపై కేసులు పెట్టడం రెచ్చగొట్డడమే'

Jun 9 2016 3:22 PM | Updated on Sep 4 2017 2:05 AM

కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ ఆమరణ దీక్షపై కేంద్ర హోం శాఖ, రాష్ర్ట గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని అనంతపురం జిల్లా కాపు-బలిజ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

-ముద్రగడ దీక్షపై కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ స్పందించాలి
అనంతపురం: కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ ఆమరణ దీక్షపై కేంద్ర హోం శాఖ, రాష్ర్ట గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకోవాలని అనంతపురం జిల్లా కాపు-బలిజ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లోకి చేరుస్తామని హామి ఇచ్చిన చం‍ద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు గడిచినా హామీలను నెరవేర్చడం లేదని అనంతపురం కాపుసంఘం నేత అమర్నాథ్ విమర్శించారు. తుని ఘటనకు బాధ్యులను చేస్తూ ఎనిమిది మంది కాపులను భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అరెస్టు అయిన నేతలను విడుదల చేయాలని కోరిన ముద్రగడపై కేసులు నమోదు చేయడం కాపులను రెచ్చగొట్టటమేనని ఆయన అన్నారు. ముద్రగడ డిమాండ్లపై సానుకూలంగా స్పందించపోతే తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాలని ఆయన హెచ్చరించారు.ఈ విషయంపై వెంటనే రాష్ట్ర గవర్నర్‌, కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని కాపుల న్యాయపరమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement