టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ పాక సురేశ్‌ను మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం పరామర్శించారు.
కార్పొరేటర్‌కు ఎంపీ పరామర్శ
Feb 27 2017 6:59 PM | Updated on Sep 5 2017 4:46 AM
కడప: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్పొరేటర్ పాక సురేశ్‌ను మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం పరామర్శించారు. పాక సురేశ్‌కు ప్రాణ హాని ఉందని వారం కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అవినాష్ఱరెడ్డి అన్నారు.
జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులపై టీడీపీ దాడులకు పాల్పడుతోందని, అనైతికంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని తాపత్రయ పడుతోందని అయన ప్రభుత్వంపై మండిపడ్డారు. వారు ఎన్ని చేసినా న్యాయమే విజయం సాధిస్తుందని చెప్పారు. జరుగుతున్న దాడులనుబట్టి ఎవరు అరాచక శక్తులో ప్రజలకు అర్థమవుతోందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ దాడుల విషయంలో స్పందించాలని అవినాష్‌రెడ్డి కోరారు.
Advertisement
Advertisement