ఆయన చరిత్రలో నిలిచిపోవాలి: మంత్రి సురేష్‌ | Minister Adimulapu Suresh Visit Tirumala Temple | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Sep 19 2019 12:11 PM | Updated on Sep 19 2019 12:23 PM

Minister Adimulapu Suresh Visit Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ పాలక మండలి మరో నాలుగు రోజుల్లో కొలువు తీరనుందని రాష్ట్ర్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్‌ వైవీ  సుబ్బారెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టారని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనాలను సరళతరం చేశారని పేర్కొన్నారు.

స్వామి వారి ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని జనవరి నుంచి ప్రారంభిస్తున్నామని చెప్పారు. నాడు.. నేడు కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి.. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement