ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. యువకుడి మృతి | man killed in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. యువకుడి మృతి

Apr 8 2016 2:08 PM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.

కళ్యాణదుర్గం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట గ్రామానికి చెందిన జగదీష్(22) బైక్ పై వెళ్తుండగా.. రాయదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి రాయదుర్గం వస్తున్న సమయంలో రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement