సరియ జలపాతంలో వ్యక్తి గల్లంతు | Man drowns in sariya waterfalls | Sakshi
Sakshi News home page

సరియ జలపాతంలో వ్యక్తి గల్లంతు

Jan 25 2016 6:33 PM | Updated on Aug 29 2018 8:36 PM

విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం జాన్‌పాడు సమీపంలోని సరియ జలపాతంలో మోహినీ తంగల్(50) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం గల్లంతయ్యాడు.

అనంతగిరి (విశాఖపట్నం జిల్లా): విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం జాన్‌పాడు సమీపంలోని సరియ జలపాతంలో మోహినీ తంగల్(50) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు జలపాతం చూసేందుకు వెళ్లారు.వారిలో తంగల్ నీళ్లలో జారిపడిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement