లాడ్జీలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య


పశ్చిమగోదావరి(పాలకొల్లు): ఓ వ్యక్తి లాడ్జీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం చోటుచేసుకుంది. విజయవాడలోని చిట్టి నగర్‌కు చెందిన బాలాజీ(40) పాలకొల్లులోని గజలక్ష్మీ లాడ్జీలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి యాజమాన్యానికి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top