
లోకేష్ బాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో యాత్ర చేపట్టనున్నారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు టీడీపీ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు 'కార్యకర్తల సంక్షేమ యాత్ర' అనే పేరు ఖరారు చేశారు.ఈ యాత్రను ఈ నెల 14 నుంచి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటగా ఈ యాత్రను చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభిస్తారని సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ సైకిల్ యాత్ర చేపడతారని గతంలో ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి. తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రజా గర్జన యాత్రను తిరుపతి నుంచి ప్రారంభించారు. తను కూడా అక్కడి నుంచే ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొందరు పార్టీ ముఖ్యులు పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ నియోజకవర్గమైన హిందూపురం నుంచి ప్రారంభించమని సలహా ఇస్తున్నారు.