'ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి' | lakshmi parvathi challenge to chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి'

Published Sat, Nov 1 2014 12:28 PM | Last Updated on Tue, May 29 2018 4:15 PM

రాష్ట్రావతరణ వేడుకలపై టీడీపీ సర్కార్ నిర్ణయం రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు.

హైదరాబాద్ : రాష్ట్రావతరణ వేడుకలపై టీడీపీ సర్కార్ నిర్ణయం రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం బేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. అవతరణ వేడుకలపై వైఎస్ఆర్ సీపీ నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు.

వైఎస్ఆర్ సీపీ  నేత లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 అని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1996 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మరి చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మార్చాలి కదా? ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement