ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ! | Kurnool SP Gopinath Jetty Speak On District Rowdy Sheeters | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ!

Jul 30 2018 7:06 AM | Updated on Jul 30 2018 7:06 AM

Kurnool SP Gopinath Jetty Speak On District Rowdy Sheeters - Sakshi

మాట్లాడుతున్న ఎస్పీ గోపీనాథ్‌ జట్టి

ఆత్మకూరు రూరల్‌: ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను జిల్లా నుంచి బహిష్కరించే యోచన ఉందని జిల్లా ఎస్పీ గోపీనాథ్‌ జట్టి తెలిపారు. ఆదివారం ఆయన ఆత్మకూరు ఎస్‌డీపీవో,  పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పల్లెనిద్ర కార్యక్రమంతో గ్రామాల్లో శాంతి భద్రతలపై అవగాహన పెరుగుతోందన్నారు. ఎన్నికలు వస్తున్నందున  హింసకు పాల్పడే వారి నేర చరిత్రను సేకరిస్తున్నామన్నారు. నేర చరిత్ర గల వారిని పోలీసులు.. బైండోవర్‌ చేసుకుంటారన్నారు.

అవసరమైతే వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అనంతరం కమ్యూనిటీ పోలీస్‌ ఆఫీసర్స్‌(సీపీవో)లతో మాట్లాడారు.  ప్రతి ఒక్కరికీ సామాజిక స్పృహ అవసరమన్నారు. సీపీవోలు చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతిభావంతంగా పనిచేసిన వారికి  నగదు రివార్డులు అందించారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్‌డీపీవో అడిషనల్‌ ఎస్పీ మాధవ రెడ్డి, సీఐ బత్తల కృష్ణయ్య, ఎస్‌ఐలు వెంకట సుబ్బయ్య, రమేష్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement