పెథాయ్‌ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదు: కలెక్టర్‌

Krishna District Collector Talk About Pethai Cyclone - Sakshi

సాక్షి, విజయవాడ: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన పెథాయ్‌ తుపాన్‌ ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండదని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  సముద్ర తీరం వెంబడి ఉన్న నాలుగు మండలాలు, 181 గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి పది మంది ప్రత్యేక ఆధికారులను నియమించామని చెప్పారు.

జిల్లాలో నేడు, రేపు చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో వరి కోతలు జరిగాయన్నారు. ప్రస్తుతం 20 వేల హెక్టార్లలో వరి పంట పాలుపోసుకునే దశలో వుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాం వల్ల పంటలకు ఎటువంటి  నష్టం వాటిల్లదని అన్నారు. తాజా సమాచారం ప్రకారం కాకినాడ, విశాఖపట్నం మధ్య పెథాయ్‌ తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top