పైలెట్ స్నిగ్ధ | Kovvali Girl P Singhdda shine in Aviation Field | Sakshi
Sakshi News home page

పైలెట్ స్నిగ్ధ

Feb 9 2014 3:12 PM | Updated on Sep 2 2017 3:31 AM

పైలెట్ స్నిగ్ధ

పైలెట్ స్నిగ్ధ

పైలెట్ గా రాణిస్తూ పురుషుల కంటే మహిళలు తక్కువేమి కాదని నిరూపిస్తున్నారు దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పి.స్నిగ్ధ.

కొవ్వలి (దెందులూరు): పైలెట్ గా రాణిస్తూ పురుషుల కంటే మహిళలు తక్కువేమి కాదని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన పి.స్నిగ్ధ. కోస్తా జిల్లాల్లో తొలి మహిళా పైలెట్ గా పేర్గాంచిన ఆమె శనివారం స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో తను అనుభవాలను పంచుకున్నారు.


‘మహిళల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది.. ఇంజినీరింగ్, మెడిసిన్ వైపే కాకుండా విద్యార్థినులు అన్ని రంగాలపై ఆసక్తి పెంచుకోవాలి. ముఖ్యంగా కేంద్ర సర్వీసులపైనా, అంతర్జాతీయ స్థాయిలో రాణించే రంగాలపై దృష్టి పెట్టాలి. నా చిన్నతనంలో బాగా చదువుకోవాలని, ఆడవాళ్లు ఉన్నతస్థాయిలో ఉండాలని మా అమ్మమ్మ ఎప్పూడూ చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దీంతో పాటు అమ్మ ఢిల్లీలో ఎయిడ్ హోస్టస్‌గా పనిచేసేవారు. అప్పుడు తరచుగా విమానాల్లో ప్రయాణించడంతో పైలెట్ కావాలని నిశ్చయించుకున్నా.

ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో రెండేళ్లు పైలెట్ శిక్షణ పొందాను. 2008-09 బ్యాచ్ పైలెట్ గా ఎంపికయ్యాను. ప్రస్తుతం ముంబైలో జెట్ ఎయిర్‌వేస్ పైలెట్ గా పనిచేస్తున్నా. తండ్రి సివిల్ సర్వీస్ అధికారి పి.రవీంద్రబాబు, తల్లి సునీత స్ఫూర్తితో ఈ స్థాయికు చేరుకోగలిగా. యువతులు పైలెట్ కోర్సు చదివి స్థిరపడాలని అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఇందుకు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి’అన్నారు. ముందుగా స్నిగ్ధకు గ్రామస్తులు, బంధువులు ఘనస్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement