ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్
సీఎం పర్యటన ఖరారు
Nov 15 2013 3:07 AM | Updated on Jul 29 2019 5:31 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3 గంట లకు పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకుం టారు. అక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రయూణించి 3.30 గంటలకు పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రచ్చబండ సభలో పాల్గొంటారు. వివిధ పథకాల కింద ఉపకరణాలు, మంజూరు పత్రాలు అందిస్తారు. సాయంత్రం 6గంటలకు పెనుగొండ ఏఎంసీ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
Advertisement
Advertisement