‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’ | katti padma rao fires on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’

Apr 27 2017 4:59 PM | Updated on Aug 29 2018 3:37 PM

‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’ - Sakshi

‘పాలవ్యాపారికి పంచాయతీరాజ్‌ శాఖా?’

ఆంధ్రపదేశ్‌ పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌పై దలిత నేత కత్తి పద్మారావు మండిపడ్డారు.

విజయవాడ: ఆంధ్రపదేశ్‌ పంచాయితీరాజ్‌ శాఖా మంత్రి నారా లోకేష్‌పై దలిత నేత కత్తి పద్మారావు మండిపడ్డారు. గ్రామాలు అంటే తెలియనినారా లోకేష్‌ను సీఎం చంద్రబాబు పంచాయతీ రాజ్ శాఖామంత్రిని చేశారని కత్తి పద్మారావు ఎత్తిపొడిచారు. రాజకీయాలు తెలియని, సరిగ్గా మాట్లాడటం చేతకాని లోకేష్‌ను మంత్రిని చేశాంరటూ ఎద్దేవా చేశారు.

అమెరికాలో చదివి, పాల వ్యాపారం చేసుకొనే వ్యక్తికి పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం దళితులని విస్మరిస్తోందని, చంద్రబాబు దళిత వ్యతిరేక శక్తిగా తయారయ్యారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement