దివీస్ లేబోరేటరీస్ వద్ద ఆందోళన | kancharapalem Villagers dharna at divis laboratories | Sakshi
Sakshi News home page

దివీస్ లేబోరేటరీస్ వద్ద ఆందోళన

Jan 25 2016 9:18 AM | Updated on Sep 3 2017 4:18 PM

విశాఖ జిల్లా భీమిలి మండలం సిటీ నగర్‌లోని దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ముందు కంచేరుపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు.

భీమిలి: విశాఖ జిల్లా భీమిలి మండలం సిటీ నగర్‌లోని దివిస్ లేబొరేటరీస్ పరిశ్రమ ముందు కంచేరుపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. దివిస్‌ లేబోరేటరీస్ ఇక్కడ మూడో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో భీమిలి పంచాయతీ పరిధిలోని కంచేరుపాలెం గ్రామాన్ని ఖాళీ చేయాలని స్థానికులను కంపెనీ కోరుతోంది.
 
ఒక్కో ఇంటికి పరిహారంగా రూ. 27 లక్షలు ఇస్తామని మధ్యవర్తులుగా టీడీపీ నాయకులను రంగంలోకి దింపింది. అయితే, తాము ఖాళీ చేసేది లేదంటూ గ్రామంలోని 200 కుటుంబాల వారు సోమవారం దివిస్ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కంపెనీ వాహనాలను అడ్డుకున్నారు. కంపెనీకి చెందిన రెండు యూనిట్లతో ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితం అయిపోయాయని, మూడో యూనిట్ వస్తే తాము ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని వారు మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement