ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. 2009 డిసెంబర్లో కూడా స్పీకర్గా కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాల డ్రామాతో తెలంగాణ అంశాన్ని గందరగోళపరిచారన్నారు.
రాష్ట్ర విభజనతో తలేత్తే సమస్యలను ఎలా పరిష్కరించాలో సూచించాల్సిన బాద్యత సీఎం కిరణ్, చంద్రబాబులదేనన్నారు. అధిష్టానం దయాదాక్షన్యాలతో సిఎం అయిన కిరణ్ సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ అధీష్టానాన్ని దిక్కరించడమేనని
పేర్కొన్నారు.