ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి | Increase Ongole breed animal origin: yv subbareddy | Sakshi
Sakshi News home page

ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి

Apr 23 2015 2:29 AM | Updated on Aug 20 2018 9:16 PM

ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి - Sakshi

ఒంగోలు జాతి పశు సంతతి పెంచండి

అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను సంరక్షించి, వాటి సంతతిని పెంచాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు.

సాక్షి, న్యూఢిల్లీ: అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను సంరక్షించి, వాటి సంతతిని పెంచాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. బుధవారం జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువుల సంతతి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. 

మరోవైపు ఒంగోలు జాతి పశువుల సంతతిని బ్రహ్మణ పేరుతో విదేశాలు అభివృద్ధిచేశాయనీ నేషనల్ బయో డైవర్సిటీ యాక్ట్ ప్రకారం ఈ పశువుల జీవద్రవ్యాన్ని విదేశాలు తీసుకునేందుకు అనుమతి లేదన్నారు. అయితే ఇటీవల బ్రెజిల్ ఒంగోలు గిత్తల వీర్యాన్ని సేకరించేందుకు కేంద్రాన్ని కోరినట్టు తెలిసిందనీ కేంద్రం ఇందుకు అనుమతించరాదని  సుబ్బారెడ్డి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement