
పోలీస్ శాఖలో ఉన్నత ప్రమాణలకు కృషి: ప్రసాదరావు
పోలీస్ శాఖలో ఉన్నతమైన ప్రమాణాలకు కృషి చేస్తానని డిజిపిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావు చెప్పారు.
హైదరాబాద్: పోలీస్ శాఖలో ఉన్నతమైన ప్రమాణాలకు కృషి చేస్తానని డిజిపిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ డాక్టర్ ప్రసాదరావు చెప్పారు. అదనపు బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన సాక్షితో మాట్లాడారు. పోలీస్ సిబ్బందికి ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను పరిశీలించి, మెరుగైన పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతిభద్రతల విషయంలో జాగ్రత్త వహిస్తానన్నారు. పోలీస్ శాఖను అత్యున్నత స్థాయికి తీసుకువెళతానని చెప్పారు.