పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు? | I learned encesaru heap? | Sakshi
Sakshi News home page

పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు?

Apr 13 2014 1:06 AM | Updated on Jul 28 2018 6:33 PM

పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు? - Sakshi

పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు?

‘కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

  •      బాబు తీరుపై ప్రజల ఆగ్రహం
  •      తప్పని నీటి కష్టాలు
  •      ట్రాఫిక్ సమస్య యథాతథం
  •      కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు
  • ‘కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. కనీసం తాగునీటి కష్టం తీర్చలేకపోయారు. పిల్లలు చదువుకునేందుకు డిగ్రీ కాలేజీ లేదు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకు నీకు ఓటేయాలి బాబూ’ అంటూ కుప్పం ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నుంచి ఎంపికవుతూ పాతికేళ్ల కాలంలో చంద్రబాబు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు తప్ప, తమను మాత్రం సరిగా పట్టించుకోలేదని కుప్పం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                               
     
     ఇవీ సమస్యలు


     సాగు, తాగునీటికి శాశ్వత సౌకర్యం కల్పించలేదు. నియోజకవర్గంలో చిన్నపాటి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. పాలారు ప్రాజెక్టు నిర్మాణం అప్పట్లో చేపట్టి ఉంటే ఇప్పుడు కుప్పం ప్రాంతంలో నీటి కొరత ఉండేది కాదు.
         
     ఇంటర్ విద్య వరకే కుప్పంలో అవకాశం ఉంది. కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు.
         
     రాతి పనిచేసేవారు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో కార్మికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. సువూరు 8 వేల వుంది నిత్యం బెంగళూరు పట్టణానికి కూలి పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారే గానీ, ఒక్క పరిశ్రవును కూడా తీసుకురాలేదు.
         
     కుప్పంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సవుస్య తీరలేదు. పట్టణంలోని ఆర్‌ఎస్ పేట, కొత్తపేటలకు అనుసంధానంగా ఉన్న రైల్వే గేట్‌ను వుూసివేయూలని రైల్వే అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే పట్టణం రెండు భాగాలై, కొత్తపేట వాసులతో పాటు అటువైపు ఉన్న గ్రావూల ప్రజలు వ్యాపార, రాకపోకలకు ఇబ్బంది పడాల్సిందే. అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది.
         
     నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటికి వురవ్ము తులు చేసిన దాఖలాలు లేవు. జాతీయు రహదారి వురవ్ముతుల కోసం అధికారులు రూ.42 కోట్లతో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
         
     వుుందుచూపు లేకపోవడంతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కొత్తపేటలోని కాంప్లెక్స్ నిరుపయోగంగా వూరింది. రైల్వేగేట్ వుూసివేతకు గురైతే ఈ కాంప్లెక్స్‌లో గదులు అద్దెకు అడిగే వారుండరు.
     
     స్పోర్ట్స్ స్టేడియుం, వూర్కెట్ యూర్డు, గార్మెంట్స్ పరిశ్రవుల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది.
         
     రూ.కోట్లతో నిర్మించిన వాటర్ ప్లాంట్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ప్రత్యావ్నూయు ఏర్పాట్లూ చేయలేదు.
     
     తాగునీరు ఇస్తున్న సాయిబాబా ట్రస్ట్


     కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రావుంలోనూ పుట్టిపర్తి సారుుబాబా ట్రస్టు ఆధ్వర్యంలో వుంచినీటి ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఈ ట్యాంకుల ద్వారానే ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందుతోంది. సాయిబాబా ట్రాస్ట్ వారికి ఉన్న మనస్సు కూడా ఆ నియోజకవర్గాన్ని పాలించే పాలకుడికి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తమను పట్టించుకోకున్నా ఇన్నేళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలు, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement