నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు! | I ask the government davakhanaku bid | Sakshi
Sakshi News home page

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు!

Jul 13 2015 12:44 AM | Updated on Sep 2 2018 4:48 PM

జిల్లాలో ఆస్పత్రుల నిర్వహణ, కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీ వైద్య విధానపరిషత్, ఆయూష్, డెరైక్టరేట్ ఆప్ కాలేజీ ఎడ్యుకేషన్, ట్రామా కేర్,

 శ్రీకాకుళం పాతబస్టాండ్:   జిల్లాలో ఆస్పత్రుల నిర్వహణ, కుటుంబ సంక్షేమ శాఖ, ఏపీ వైద్య విధానపరిషత్, ఆయూష్, డెరైక్టరేట్ ఆప్ కాలేజీ ఎడ్యుకేషన్, ట్రామా కేర్, డయాలిసిస్ విభాగాలు ఉన్నాయి. వీటిలో అన్ని కేంద్రాల్లోనూ పేదలు ఉచితంగా వైద్యం పొందవచ్చు. అయితే ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీంతో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి చేతి చమురు
 
 వదిలించుకుంటున్నారు.
 జిల్లా వైద్యఆరోగ్య శాఖ పరిధిలో 18 క్లస్టర్లు ఉండగా.. వీటి పరిధిలో 75 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 423 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో పలు పీహెచ్‌సీలు వసతుల సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిలో పని చేస్తున్న 46 మంది వైద్యులు ఉన్నత చదువులకు వెళ్లిపోగా.. వారి స్థానాలు భర్తీ చేయలేదు. దీంతో 46 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులులేక, ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. నర్సింగ్ సిబ్బంది కొరత ఉంది. సుమారుగా 42 మందిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వేసినా నియామాకాలు జరగలేదు. ల్యాబ్ టెక్నీషన్లు, ఫార్మాసిస్టుల కొతర వెంటాడుతోంది. 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ల్యాబ్‌లకు నోచుకోలేదు.
 
   ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో రెండు ఏరియా, 12 కమ్యూనిటీ ఆస్పత్రులు  ఉన్నాయి. వీటిలో సైతం స్పెషలిస్టుల కొరత ఉంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్టులు కనీసం 12 మంది ఉండాల్సి ఉండగా ఆ పరిస్థితి లేదు. దీంతో రోగులు వైద్యానికి నోచుకోవడం లేదు. ప్రధానంగా సర్జన్లు, మెడికల్, డెంటల్, గైనిక్, ఈఎస్‌టీ, ఎముకలు తదితర విభాగాల వైద్యులు ఉండాల్సిన్నా వీరి నియామాకాలు జరగలేదు.  104,108 సేవలు ఏడాదిగా సక్రమంగా అందడం లేదు. ప్రాణదాతగా పేరున్న 108 వాహనాలు నాలుగు మూలకు చేరాయి. మిగిలిన వాటికి డీజల్ కొరతతో అరకొర సేవలు అందిస్తున్నాయి. ఇక 104 వాహనాల విధులు మారాయి. 18 క్లస్టర్లకి వాహనాలను సమకూర్చినప్పటికీ నిధుల లేమితో సతమతమవుతున్నాయి. దీంతో ఈ వాహనాలను అధికారులు వారి అవసరాలకు వాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతలకు వెళ్లి మందులిచ్చే సేవలు సంవత్సరంగా నిలిచిపోయాయి.
 
 ‘ఆయూష్’ను పట్టించుకోలేదు
 ఆయూష్ విభాగాన్ని ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదు. పదేళ్లుగా పది పడకల ఆయూష్ ఆస్పత్రి నిర్మాణం కోసం జిల్లా వాసులు పోరాడుతున్నా ప్రయోజనం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో యూనాని, ఆయుర్వేదిక్, హోమి యో, నేచురోపతి వైద్యులు ఉండాలని గతంతో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ విషయాన్ని నేటి పాల కులు పక్కన పెట్టారు. దీంతో ఈ విభాగం ద్వారా అరకొరగానే సేవలు అందుతున్నాయి.
 
 రిమ్స్ తీరేవేరు
 జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆస్పత్రి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచింది. ఇక్కడ అన్నీ సమస్యలే. పేరుకే మెడికల్ కళాశాల. సూపర్ స్పెషాలిటీ వైద్యం మాత్రం ఆందుబాటులో లేదు. ప్రమాదకర వ్యాధైనా, ప్రమాదం జరిగి వచ్చిన ఇక్కడ వైద్యం అందడు. చిన్నపాటి రోగమైన విశాఖపట్నం రిఫర్ చేయాల్సిందే. రోజూ సుమారుగా ఏడు వందల ఓపీ ఉన్న ఈ ఆస్పత్రిలో న్యూరో సర్జన్, కార్డియాలజీ, ఇతర విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యులు లేరు. కొన్ని విభాగాలకు విశాఖపట్నం నుంచి అప్పుడప్పుడు వస్తుంటారు.  ప్రస్తుత ం 142 మంది వైద్యులు ఉన్నా, ఇంకా కొరత ఉంది. స్టాప్ నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బది కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఇక్కడ పని చేసే వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది సైతం విశాఖ నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ వైద్యం గగనంగా మారింది.
 
   డయాలసిస్ కేంద్రాల కొరత
  ఉద్దానం ప్రాంతంతో కిడ్నీ రోగులు అధికంగా ఉన్నారు. వారి కోసం రిమ్స్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.
 అయితే ఈ కేంద్రంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది,  టెక్కలి, సోంపేటల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు కోరుతున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.  దీంతో కిడ్నీ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
 అవసాన దశలో ట్రామాకేర్
  ట్రామాకేర్ కూడా అవసాన దశకు చేరుకుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఆస్పత్రులకు పరిమితమయ్యాయి. టెక్కలి ఏరియా ఆస్పత్రి, శ్రీకాకుళంలోని రిమ్స్‌లో ఈ విభాగాలు నడుస్తున్నాయి. ఈ కేంద్రాల నిర్వహణకు సైతం ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement