ప్రిన్సిపాల్ ఎదుటే విద్యార్థులను చితకబాదిన వార్డెన్

సాక్షి, వైఎస్సార్ జిల్లా : సెల్‌ఫోన్లు ఉన్నాయనే అనుమానంతో హాస్టల్ వార్డెన్ విద్యార్థులను దారుణంగా కొట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని బుగ్గవంక దారిలో ఉన్న శ్రీచైతన్య స్కూల్లో జరిగిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ముందే విద్యార్థులను చితకబాదడం గమనార్హం. పదో తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులను అనుమానంతో హింసించడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. జయమని కంఠేశ్వర్ రెడ్డి అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, స్కూలు యాజమాన్యాన్ని నిలదీయగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి