ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!! | highest petro prices in ap only, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!

Mar 20 2015 2:34 PM | Updated on Aug 18 2018 8:54 PM

ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!! - Sakshi

ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!

పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పెట్రోలు మీద 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా వేశారని, డీజిల్ మీద 22.2 శాతం పన్నుతో పాటు మరో రూ. 4 అదనంగా వడ్డించారని విమర్శించారు. శుక్రవారం ఆయన లోటస్పాండ్లో మాట్లాడుతూ పలు వివరాలు చెప్పారు. దేశంలోనే ఇలాంటి రేట్లు ఎక్కడా లేవని, పోనీ దీనివల్ల రాష్ట్రానికి వనరులు పెరుగుతున్నాయా అంటే అదీ లేదని ఎద్దేవా చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు అంటే.. అది తెలుగు-కాంగ్రెస్ సర్కారని ఆయన విమర్శించారు. కిరణ్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచినప్పుడు ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేయించి మరీ కిరణ్ సర్కారును కాపాడారని ఆయన గుర్తుచేశారు.

కిరణ్ కుమార్ రెడ్డికి అప్పుడున్న బలం 146 కాగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం తక్కువగా ఉందని చెప్పారు. ఆరోజు గనక చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే.. కిరణ్ ప్రభుత్వం ఉండేది కాదని అన్నారు. అలాంటి చంద్రబాబు.. ఇప్పుడు కిరణ్ ప్రభుత్వాన్ని తిడుతూ.. దానికి, తమకు లింకు పెడతారని అన్నారు. అలాంటి అమోఘమైన తెలివితేటలు చంద్రబాబువని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement