భారీ వర్షం : తడిసిముద్దయిన దుర్గమ్మ భక్తులు | Heavy Rains In VIjayawada | Sakshi
Sakshi News home page

Oct 15 2018 4:35 PM | Updated on Oct 15 2018 8:20 PM

Heavy Rains In VIjayawada - Sakshi

సాక్షి, విజయవాడ : భారీ వర్షంతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.కొండపైకి మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్ల లో వున్న భక్తుకు తడిసిపోయారు. కొండ పైన భారీవర్షం ఒక్కసారిగా కురవడంతో అధికారులు సైతం కంగారు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్దులతో కొండపైకి వచ్చిన భక్తులు పూర్తిగా తడిచిపోయారు. అరగంట పాటు కురిసిన వర్షం తరువాత తెరపి ఇవ్వడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం ఇదే విధంగా కొనసాగితే విద్యుత్ సరఫరాను వర్షం తగ్గే వరకు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని అధికారుల ఆందోళన వ్యక్తం చేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement